HELP WANTED – సహాయము కావలెను

నల్గొండ జిల్లా కళాశాల విద్యార్థులందరికి,

నా నమస్కారములు!

ముఖ్యముగా,
B.A.,
B.Com.,
B.Sc.,
B.E., B.Tech., – Engineering,
M.B.B.S., – Medicine,
M.A.,
M.B.A.,
M.Com.,
M.Sc.,
M.Tech., – Engineering,
M.S., M.D., – Medicine, … మరియు ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులందరికి ఒక విజ్ఞప్తి:

ఈరోజు మన సమాజంలో, పెద్ద మొత్తంలో “క్రమ శిక్షణ” (Discipline), మరియు “నిజాయితీ” (Honesty) పూర్తిగా లోపించింది, కాబట్టి మనలో ఉన్న లోపాలను, బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే సమయమని, ఈ విషయాన్ని మనమందరము తెలుసుకోవాల్సిన అవసరము ఎంతో ఉందని, అప్పుడే పెద్ద మొత్తంలో మనకున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, గుర్తు చేసే ప్రయాసే – సమస్యలు.కాం.

నల్గొండ జిల్లా ప్రజల సమస్యలు మన అందరి సమస్యగా భావించి, ఇప్పటివరకు మనము చదివిన చదువుల ద్వారా పొందిన జ్ఞానాన్ని (Acquired Knowledge) ఉపయోగించి, కుల, మత, బీద, బిక్కి, తేడాలు లేకుండా అందరం కలసికట్టుగా, ఆచరణాత్మకంగా పరిష్కారాన్ని వెతుకవలసిన భాద్యత మన అందరిది అని తెలుసుకోవలెను.

ఎందుకంటే;
“మన సామజిక అవగాహనా లోపం వల్ల మన ‘జీవన నాణ్యత’ (Quality of Life), మరియు మన ‘జీవన ప్రామాణికం’ (Standard of Living) రోజు రోజుకు దిగజారిపోతోంది.”

“Our ‘Quality of Life’ and ‘Standard of Living’ are degrading day by day, due to lack of our ‘Social Awareness’.”

నల్గొండ జిల్లా గ్రామ మరియు నగర ప్రజల సమస్యలను “సమస్యలు.కాం” లో పొందుపరిచేందుకు మీ నుంచి “స్వచ్చంద సహాయాన్ని” (Volunteer Help) కోరుకుంటున్నాను.

చేయవలసిందేమిటంటే;

మీరు “మీ స్వంత” గ్రామాల్లో, నగరాల్లో ఉన్న చదువురాని రైతుల సమస్యలను మరియు ఇతర చదువురాని ప్రజల సమస్యలను “సమస్యలు.కాం” లో పొందుపరుచాలని మనవి చేసుకుంటున్నాను.

కేవలము మీకున్న తీరిక సమయంలో మాత్రమే ఈ సహాయాన్ని మీ దగ్గరున్నటువంటి “Desktop Computer”, “Laptop Computer” లేదా “Smartphone” ద్వారా మీ గ్రామ ప్రజల సమస్యలను, నగర ప్రజల సమస్యలను పొందుపరుచవచ్చును. మీరు ఆ సమస్యలను “తెలుగు” లో లేదా ఆంగ్లము (English) లో కూడా పొందుపరుచవచ్చును. మీకు ఏ భాష సులభమో, ఆ భాషలోనే సమస్యలను పొందుపరుచవచ్చును.

మీరు వారానికి ఒకటి, లేదా రెండు సమస్యలను పొందుపరిచినా చాలు, ఎందుకంటే ఇది “స్వచ్చంద సహాయము” (Volunteer Help) కాబట్టి మీరు శక్తికి మించిన భారాన్ని తమ భుజాల పైన వేసుకోవద్దు – కేవలం మీకున్న తీరిక సమయంలో మాత్రమే ఈ సహాయాన్ని అందించాలని మనవి చేసుకుంటున్నాను.

దీనికి కాల పరిమితి అంటూ ఏమీ లేదు, మీ సహాయాన్ని ఎల్లవేళలా, ఎప్పుడైన అందించవచ్చును.

మనమంతా స్వేచ్చా జీవులం కాబట్టి, మనకున్న మానవత్వ దయాగుణాలతో మాత్రమే మన ఇష్టానుసారంగా “స్వచ్చంద సహాయము” (Volunteer Help) అందించడానికి ముందుకు రావలెను. అందుచేత మనమెవ్వరము ఎలాంటి ఒత్తిడులకు లోను కాకూడదు – వీలుపడని సమక్షంలో.

మీరు సహాయము చేయుటకు;

  1. ముందుగా మీకొక ఇమెయిల్ అడ్రస్ (E-mail Address) ఉండాలి.
  2. ఆ ఇమెయిల్ అడ్రస్ (E-mail Address) తో, ఈ క్రింది ఇమెయిల్ అడ్రెస్స్ కు ఒక ఇమెయిల్ (Em-mail) పంపవలెను.

E-mail: volunteers@samasyalu.com

E-mail Subject: “Volunteer Help”

E-mail Message: My name is: ” ………………………… “, and I am ready to help, as a Volunteer!

My Phone Number / WhatsApp: ” …………………………………. ” .

దాని వల్ల, మీరు స్వచ్చంద సహాయము (Volunteer Help) చేయుటకు సిద్ధమేనని, మాకు తెలుస్తుంది.

  1. ఆ తర్వాత మీరు మీ జిల్లా, గ్రామ మరియు నగరాల్లో ఉన్న చదువురాని పేదల సమస్యలను “సమస్యలు.కాం” వెబ్సైటులో మీ జిల్లా కు సంబంధించిన సమస్యలను పొందుపరుచవలెను.

– ధన్యవాదములు!


samasyalu.com
FOUNDER


SAMASYALU.COM – IS AN ONLINE WEB PORTAL, TOTALLY COMMITTED AND DEDICATED TO SERVE THE PEOPLE OF BOTH THE TELUGU STATES WITH ITS ALTRUISTIC VISION TO IMPROVE THE QUALITY OF OUR LIVES BY BRINGING OUR SOCIAL PROBLEMS TO EVERYBODY’S ATTENTION – WITHOUT ANY DISCRIMINATION.